OTTకి వచ్చేస్తున్న లియో.. ఇంత తొందరగానా?

OTTకి వచ్చేస్తున్న లియో.. ఇంత తొందరగానా?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay thalapathy), స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో(Leo). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ గా రూ. 146 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం నాలుగురోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Also Read :- అమితాబ్ బచ్చన్, రజినీకాంత్‌‌ కాంబోకు స్పెషల్ క్రేజ్

ఇదిలా ఉంటే తాజాగా లియో ఓటీటీ రిలీజ్ కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు  ఈ సినిమా నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికి ఈ సినిమా నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి మేకర్స్ లియో సినిమా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.