రిలయన్స్ తో సాంప్రే న్యూట్రిషన్స్ ఒప్పందం

రిలయన్స్  తో సాంప్రే న్యూట్రిషన్స్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు:  రిలయన్స్​ కన్స్యూమర్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్​ (ఆర్​సీపీఎల్​)తో హైదరాబాద్​కు చెందిన కన్ఫెక్షనరీ కంపెనీ సాంప్రే చేతులు కలిపింది.  15 కోట్ల వార్షిక ఆదాయం అంచనాతో మూడేళ్లకు తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్​సీపీఎల్​కు ఇది న్యూట్రాస్యూటికల్​, ఆహార పదార్థాలను తయారు చేసి అందిస్తుంది.

 నైజీరియాలోని టోలారామ్​ వెల్నెస్​ లిమిటెడ్​తో రూ. 10 కోట్ల వార్షిక వ్యాపారం,  రామా ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌తో రూ. 15 కోట్ల విలువ గల ఒప్పందాలు చేసుకున్నామని తెలిపింది.  రూ. 355.06 కోట్ల విలువైన ఎఫ్‌‌‌‌సీసీబీల ఇష్యూ కు కూడా  ఆమోదం లభించిందని సాంప్రే ప్రకటించింది.