
న్యూఢిల్లీ: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (ఆర్‌సీపీఎల్)తో తయారీ ఒప్పందం కుదుర్చుకున్నామని తెలంగాణ బేస్డ్ కంపెనీ సాంప్రే న్యూట్రిషన్స్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం తీపి పదార్ధాల తయారీ, ప్యాకేజింగ్, రిలయన్స్‌కు సప్లయ్ చేయడం వంటివి సాంప్రే చూసుకుంటుంది.
ఆర్‌సీపీఎల్ క్వాలిటీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు వీటిని తయారు చేస్తుంది. మూడేళ్ల కాలానికి చేసుకున్న ఈ ఒప్పందంతో ఏడాదికి రూ.12–15 కోట్ల రెవెన్యూ వస్తుందని సాంప్రే అంచనావేస్తోంది. ఈ కంపెనీ ఏడాదికి రూ.45 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసే ఒప్పందాలను వివిధ కంపెనీలతో ఇప్పటికే కుదుర్చుకుంది. అంతేకాకుండా ఈజిప్ట్, లైబీరియా వంటి మార్కెట్లలో విస్తరించేందుకు ప్లాన్స్ వేస్తోంది.