శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఎం36 5జీ లాంచ్

శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఎం36 5జీ లాంచ్

శామ్‌‌‌‌సంగ్ ఇండియాలో గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‌‌‌లో సర్కిల్ టు సెర్చ్,  జెమినీ లైవ్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌‌‌‌డీ ప్లస్‌‌ సూపర్ అమోలెడ్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే, 120 హెడ్జ్‌‌‌‌ రిఫ్రెష్ రేట్‌‌‌‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్  ప్లస్‌‌  ప్రొటెక్షన్‌‌‌‌ వంటివి  ఈ ఫోన్‌‌‌‌లో ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ సామర్ధ్యం దీని సొంతం. 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌‌‌ ఉంది.

ఫోన్‌‌‌‌ వెనుక భాగాన  50ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 4కే వీడియోలను తీయొచ్చు.  ఈక్సినోస్ 1380  ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌తో అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎం 36  ధర  రూ.17,500 నుంచి మొదలవుతోంది.  జులై 12 నుంచి అమెజాన్, శామ్‌‌‌‌సంగ్ ఇండియా వెబ్‌‌‌‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌‌‌‌లలో సేల్స్ ప్రారంభమవుతాయి.