
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ ఇండియా మార్కెట్లోకి సోమవారం ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్5ఈ’, ‘గెలాక్సీ ట్యాబ్ 10.1’ అనే ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ఇవి రెండూ ‘అండ్రాయిడ్ 9’ ఆధారిత వన్ యూఐపై పనిచేస్తాయి. ట్యాబ్ ఎస్5ఈ ధర రూ.35,999. ఇందులో 10.50 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ 670 ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ, వై-ఫై ఫీచర్లు ఉన్నాయి. ఇక గెలాక్సీ ట్యాబ్ 10.1 ధర రూ.14,999. ఇందులో 10.10 ఇంచుల డిస్‌ప్లే, ఈక్సినోస్ 7904 ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 6,150 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వచ్చే నెల నుంచి వీటి అమ్మకాలు మొదలవుతాయని కంపెనీ తెలిపింది.