
న్యూఢిల్లీ:భారతదేశంలో ఈ నెల 9న లాంచ్ అయిన సెవెన్త్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం రెండు రోజుల్లో 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చాయని శామ్‌సంగ్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7లను కంపెనీ తీసుకొచ్చింది.
ఈ ఏడాది మొదట్లో గెలాక్సీ ఎస్25 సిరీస్ కోసం 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లు (సుమారు మూడు వారాల్లో) వచ్చాయి. 48 గంటల్లో ఎస్25, ఫోల్డ్7/ఫ్లిప్7 ప్రీ-ఆర్డర్లు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ల ధరలు రూ.89 వేల నుంచి రూ.2.11 లక్షల మధ్య ఉన్నాయి.
ఈ ఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐడీసీ ప్రకారం, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వీవో 19.7 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, శామ్‌సంగ్ 16.4శాతం షిప్‌మెంట్‌లతో రెండో స్థానంలో ఉంది.