మార్కెట్​లోకి శామ్​సంగ్​ ఏ55,  ఏ35 ఫోన్లు

మార్కెట్​లోకి శామ్​సంగ్​ ఏ55,  ఏ35 ఫోన్లు

న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్​సంగ్ హైదరాబాద్​లో బుధవారం ఏ55,  ఏ35 ఫోన్లను లాంచ్ చేసింది.  హైసెక్యూరిటీ, హైరిజల్యూషన్​ కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు వీటి సొంతమని తెలిపింది. 2024 క్యాలెండర్ ఇయర్‌‌లో  తన షిప్‌‌మెంట్ల 75శాతం ఫోన్లు 5జీవి ఉంటాయని పేర్కొంది.

ఇండియా 5జీ హాండ్​సెట్స్​ మార్కెట్లో తమకు 21శాతం మార్కెట్ వాటా ఉందని, స్మార్ట్​ఫోన్ల అమ్మకాల విషయంలో 18 శాతం వాటాతో తాము నంబర్​వన్​ అని తెలిపింది.  రూ. 30 వేలు–-50 వేల మధ్య ధర ఉన్న హ్యాండ్‌‌సెట్‌‌లలో తమకు 31శాతం వాటా ఉందని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ గుఫ్రాన్​ఆలమ్​ పేర్కొన్నారు.