నీకింతటి ధైర్యమెక్కడిది..తప్పు చేస్తున్నావు.. నిర్మాతపై సముద్రఖని ఫైర్

నీకింతటి ధైర్యమెక్కడిది..తప్పు చేస్తున్నావు.. నిర్మాతపై సముద్రఖని ఫైర్

తమిళ స్టార్ హీరో కార్తి (Karthi) వెండితెరకు పరిచయమైన చిత్రం ‘పరుత్తివీరన్‌’ (Paruthiveeran). దాదాపు 16 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా విషయంలో గత కొన్నిరోజుల నుంచి..ఆ చిత్ర దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది.  పరుతివీరన్‌ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ లెక్కలు చూపించి దర్శకుడు అమీర్ తమ నిర్మాణ సంస్థ నుంచి..భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని నిర్మాత జ్ఞానవేల్ సంచలన కామెంట్స్ చేశారు.

ఇక ఇదే విషయంపై డైరెక్టర్ అమీర్ రియాక్ట్ అయ్యారు. జ్ఞానవేల్ రాజా చేసిన మాటల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అమీర్ కి తన మద్దతు తెలియజేస్తూ నటుడు సముద్రఖని (Samuthirakani) ఓ లేఖ పోస్ట్ చేశారు. .

‘పరుత్తివీరన్‌’ సినిమాలో నేనూ నటించాను. ఆ సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు ఆమిర్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు.(జ్ఞానవేల్‌ రాజాని ఉద్దేశించి..) మీరు ఏ ఒక్క రోజు కూడా షూటింగ్ కి వచ్చినట్టు నాకు గుర్తు లేదు..ఇక సినిమా షూట్ చివర్లో వచ్చి నేనే ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నాడు. మొదట్లో షూటింగ్ చేసేందుకు బడ్జెట్ లేకపోతే దర్శకుడు పెద్ద మొత్తంలో ఖర్చు భరించాడు.అప్పటికీ డబ్బులు చాలకపోతే..సెట్స్ నుంచి తలా కొంత మొత్తం వేసుకుని షూట్ పూర్తి చేశాం. మేమందరం ఇంత కష్టపడి షూట్ చేయాలా? మీలాగే సినిమాను మధ్యలో వదిలేయొచ్చు కదా? అని చాలా మంది అంటే.. మనం అలా చేస్తే హీరోగా ఎంట్రీ ఇస్తున్న కార్తీ కెరీర్ ఏమవుతుంది..అతనికి ఇది చాలా ఆశలతో కూడిన మొదటి సినిమా..ఎలా అయినా పూర్తి చేయాలని అమిర్ అన్నాడని సముద్ర ఖని తెలిపారు. 

అంతేకాకుండా..ఆ టైంలో హీరో సూర్య సైతం చాలా సాయం చేశాడు. అందరం కలిసి కష్టపడి పూర్తి చేసిన సినిమాకు..చివర్లో వచ్చి నీ పేరు వేసుకుని,,నాదంటే సరిపోతుందా? అసలు మీకు అలా చేయడానికి ఎంత ధైర్యం? నువ్వు తప్పు చేస్తున్నావు..ఆ రోజు మేం సినిమాను ఆపేస్తే..సినిమా ఇండస్ట్రీకి అరుదైన నటన ఉన్న కార్తీ లాంటి హీరో వచ్చేవాడా? ఎంతో  కష్టపడినా దర్శకుడి మీద అర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదు..ఇక ‘పరుత్తివీరన్‌ మూవీ కోసం అందరం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు’’ అని సముద్ర ఖని ఫైర్ అయ్యాడు.

అసలేం జరిగిందంటే: 

రీసెంట్ గా హీరో కార్తి నటించిన 25 చిత్రం ‘జపాన్‌’. ఈ మూవీకి  జ్ఞానవేల్‌ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అటెండ్ అయ్యారు. కానీ కార్తి ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్‌ మాత్రం ఈవెంట్ లో ఎక్కడ కనిపించలేదు. ఇదే విషయంపై అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జపాన్‌ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. ఇప్పటికీ సూర్య - కార్తితో నాకు ఎలాంటి సత్సంబంధాలు లేవు. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌ రాజా మధ్యలో రావడంతోనే మా మధ్యన ఉన్న గ్యాప్ కు కారణం అని చెప్పారు. 

దీనిపై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌ రాజా స్పందిస్తూ..ఆమిర్‌ కి ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్‌ మూవీ విషయంలో నన్ను చాలా ఇబ్బందిపెట్టాడు. మొదట్లో అనుకున్న బడ్జెట్ కంటే..నాతో ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టించాడు. అందులోను సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’’ అని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నటుడు,డైరెక్టర్ సముద్రఖని లేటెస్ట్ గా బహిరంగ లేఖ ద్వారా అసలు ఏం జరిగిందో అని తన మాటల్లో వివరించాడు.