సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ లైనప్‌‌తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. రీసెంట్‌‌గా హరీష్ శంకర్‌‌తో ‘ఉస్తాద్ భగత్‌‌సింగ్’ సినిమా ప్రారంభించారు. అలాగే సుజిత్‌‌తోనూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీటితో పాటు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న సినిమా ఒకటుంది. అదే ‘వినోదయ సిత్తం’ రీమేక్. తమిళంలో నటిస్తూ, డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహించనున్నాడు.

ఇందులో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌‌ చేస్తున్నాడు. పవన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నారు. దీనికి స్క్రిప్ట్ కరెక్షన్లు, డైలాగులు త్రివిక్రమ్ సూపర్ విజ‌‌న్‌‌లో సాయి మాధవ్ బుర్రా రెడీ చేశారు. జ‌‌నవరిలో ఈ సినిమా సెట్స్‌‌కి వెళ్లనుందని, సంక్రాంతి తర్వాత షూటింగ్‌‌లో జాయిన్ అయ్యేందుకు పవన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ హోస్ట్‌‌గా చేస్తోన్న ‘అన్ స్టాపబుల్’ సెకెండ్‌‌ సీజన్‌‌లో పవన్ పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్స్ త్రివిక్రమ్, క్రిష్ వెళ్లబోతున్నారట. డిసెంబర్ 27న ఈ షో షూట్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.