సినిమానే నాకు జీవితమైపోయింది : సంయుక్తా మీనన్‌‌

సినిమానే నాకు జీవితమైపోయింది : సంయుక్తా మీనన్‌‌

‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్‌‌ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ధనుష్​ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘సార్’ మూవీలో  హీరోయి న్‌‌గా నటించింది సంయుక్తా.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవు తోంది. ఈ సందర్భంగా సంయుక్తా ఇలా ముచ్చటించింది.

‘‘నేను కేరళలోని చిన్న గ్రామానికి చెందిన అమ్మాయిని. నటిగా సంతృప్తినిచ్చే ఒక్క సినిమా చేస్తే చాలనుకుని మలయాళంలో కెరీర్ మొదలుపెట్టాను.  ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్‌‌‌‌లోనే బెస్ట్ ఫేజ్ అనిపిస్తుంది.  ‘భీమ్లా నాయక్’ తర్వాత సితార బ్యానర్‌‌‌‌లో రెండో సినిమా చేయడం హ్యాపీ. డైరెక్టర్ వెంకీ  కథ చెప్పగానే ఈ సినిమా కచ్చితంగా చేయాలనుకున్నాను.  కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. ఇందులో నేను  పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అలాగే పాత్ర గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్టర్, రైటర్‌‌‌‌తో  చర్చించాను. మీనాక్షి క్యారెక్టర్‌‌‌‌లో బయోలజీ టీచర్‌‌‌‌గా కనిపిస్తాను.  టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది?  ఇలాంటివన్నీ కూడా గమనించాను. ధనుష్‌‌కి నేను అభిమానిని. మంచి నటుడే కాదు, పెద్ద స్టార్ కూడా.  అలాంటి నటుడితో  నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన దగ్గర్నుంచీ కొన్ని విషయాలు నేర్చుకున్నాను.  ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్‌‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి’’.