సంయుక్త లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. ఈ యాక్షన్ డ్రామాకు ‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్ కేఎంసీ దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌తోపాటు ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోంది.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయిందని, మరో పదిహేను రోజుల్లో మిగతా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బీవీఎస్ రవి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అంది స్తున్నాడు.
