ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా ఇసుక దందా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా ఇసుక దందా

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా మూడు పూలు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. అభివృద్ధి పనుల పేరిట మంజీరా నదీ తీరంలో ఉన్న ఇసుకను అక్రమంగా తవ్వుతూ కొందరు కాసుల పంట పండించుకుంటున్నారు. పర్మిషన్‌ లేకుండా ఇసుక క్వారీ నిర్వహిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలోని మంజీరా నది తీరంలో ఉన్న కోటగిరి మండలంలో కల్లూరు, కొడిచర్ల, పోతంగల్, హంగర్గ, కారెగామ్‌, సుంకిలో ఆరు క్వారీలు, బోధన్ మండలంలో మందార్న, సిద్ధాపూర్ రెండు మొత్తం 8 క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల పర్మిషన్​ గడువు పూర్తియినా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతి రోజూ వందలాది టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.