నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బదిలీ

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి  బదిలీ

నిజామాబాద్​,  వెలుగు: కలెక్టర్ టి.వినయ్​కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. మంగళవారం సాయంత్రం గవర్నమెంట్​ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలోని మల్కాజ్​గిరి, ఎల్​బీనగర్​, ఉప్పల్​ జోన్​కు అదనపు కమిషనర్​గా వినయ్​కృష్ణారెడ్డిని నియమించింది. ఈ ఏడాది జూన్​ 13న కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న వినయ్​కృష్ణారెడ్డి అనూహ్యంగా బదిలీ కావడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. 

ఆరు నెలల కింద వచ్చిన ఆయన తన బదిలీ ఊహించలేదు. మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్​, భీంగల్ మున్సిపాలిటీలు వెళ్లొచ్చిన ఆయనకు బదిలీ సమాచారం తెలిసింది. జిల్లాలో కలెక్టర్ బాధ్యతలు స్వీకరించాక వినయ్​కృష్ణారెడ్డి వారంలో దాదాపు ఐదు రోజులు ఫీల్డ్​ విజిట్​కు వెళ్లేవారు. మధ్యాహ్నం నుంచి ఆఫీస్​లో ఉండేవారు. ట్రాన్స్​ఫర్​పై వెళ్తున్న వినయ్​కృష్ణారెడ్డి స్థానంలో 2017 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నుంచి వస్తున్నారు.