సోలార్  విద్యుత్ తో అనేక ప్రయోజనాలు : స్టేట్​ ప్లానింగ్ ప్రిన్సిపల్సెక్రటరీ సందీప్ కుమార్  సుల్తానియా

సోలార్  విద్యుత్ తో అనేక ప్రయోజనాలు : స్టేట్​ ప్లానింగ్ ప్రిన్సిపల్సెక్రటరీ సందీప్ కుమార్  సుల్తానియా

వంగూరు, వెలుగు: సోలార్  విద్యుత్  ప్లాంట్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయని రాష్ట్ర ప్లానింగ్  ప్రిన్సిపల్  సెక్రటరీ సందీప్ కుమార్  సుల్తానియా పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్  విద్యుత్  ప్లాంట్లను ఆయన టీజీ ఎస్పీడీఎల్​ సీఎండీ ముషారఫ్  అలీ ఫారూఖీతో కలిసి పరిశీలించారు.

. ఈ సందర్భంగా సందీప్ కుమార్  సుల్తానియా మాట్లాడుతూ.. గ్రామాన్ని మోడల్  విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట రాంకో వైస్  చైర్మన్  అనిల్​ వాయిలాల, రాష్ట్ర వ్యవసాయ కమిషన్  మెంబర్  కేవీఎన్  రెడ్డి, తహసీల్దార్  మురళీమోహన్, ఎంపీడీవో బ్రహ్మచారి, ఆర్ఐ వసీం, మాజీ ఉప సర్పంచ్  ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శశిపాల్ రెడ్డి, అనిల్, లాల్ రెడ్డి పాల్గొన్నారు.