ప్రేమ కంటే ప్రతీకారం గొప్ప ఎమోషన్ : సందీప్ రెడ్డి వంగా

ప్రేమ కంటే ప్రతీకారం గొప్ప ఎమోషన్  : సందీప్ రెడ్డి వంగా

‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్‌‌ హిట్‌‌తో మెప్పించిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ‘యానిమల్’ అనే హై ఓల్టేజ్‌‌ యాక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌ని రూపొందించాడు.  రణ్‌‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ఐదు భాషల్లో  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా చెప్పిన విశేషాలు. 

 ‘అర్జున్ రెడ్డి’ అమ్మాయి అబ్బాయి ప్రేమకథ అయితే.. ఇది తండ్రీకొడుకుల ప్రేమకథ. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది మెయిన్ కాన్సెప్ట్. ‘అర్జున్ రెడ్డి’ విషయానికి వస్తే.. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉండే పాత్ర అది. అలాంటిది  ప్రేమ దూరమైనపుడు ఇంటెన్స్ ఎమోషన్ ఉంటుంది. ‘యానిమల్’లో తండ్రి కోసం ఏదైనా చేయగలిగే  కొడుకు పాత్ర కాబట్టి సహజంగానే ఎమోషన్‌‌లో చాలా హై ఉంటుంది. 

ట్రైలర్‌‌‌‌లో ఆ ఎమోషన్‌‌ను  స్పష్టంగా చూడొచ్చు. ఎమోషన్‌‌, వయొలెన్స్ రెండింటినీ పర్ఫెక్ట్‌‌గా బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నా. రణ్‌‌బీర్ కపూర్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.  దేశంలో ఉన్న బెస్ట్ యాక్టర్స్‌‌లో తనొకడు.  ఒక పెద్ద స్టార్. ఎన్నో సినిమాల అనుభవం ఉందనే భావన ఆయన ఎప్పుడూ చూపించలేదు.  కథ చెప్పగానే నచ్చిందన్నాడు. తర్వాత కథ గురించి, సినిమా గురించి మాట్లాడుకోవడమే కానీ మరో చర్చ లేదు. 

 ఇందులో -ర‌‌ష్మికది  చాలా ఇంపార్టెంట్ రోల్. రెగ్యులర్‌‌‌‌గా కాకుండా చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. హీరోని పేరెంట్స్ కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర తనది. రణ్‌‌బీర్  తర్వాత సమాన ప్రాధాన్యత ఉన్నది ర‌‌ష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. అనిల్ కపూర్ గురించే కథ డ్రైవ్ అవుతుంది.  బాబీ డియోల్ విలన్‌‌గా కనిపిస్తారు. ఆ పాత్రల గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. 
 నా సినిమాలో సౌండ్, మ్యూజిక్‌‌కి చాలా ప్రాధాన్యత ఇస్తా. ముంబైలో సోలో కంపోజర్‌‌‌‌తో వెళ్ళడం కష్టమైపోయింది. అందుకే డిఫరెంట్ కంపోజర్స్‌‌తో ట్యూన్స్ చేశాం.  హర్ష వర్ధన్ రామేశ్వర్ మాత్రం బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఇచ్చారు.  తెలుగు లిరిక్స్ విషయానికొస్తే..  అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. తెలుగు నేటివిటీకి తగట్టుగా లిరిక్స్ ఉన్నాయని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.
 
 మనకి చదువు, తెలివితేటలు వచ్చి మనిషి అనే పేరు పెట్టుకున్నాం. నిజానికి మనిషి కూడా ఓ సోషల్ యానిమల్. జంతువులకు ఐక్యూ  ఉండదు.. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తాయి. ఇందులో హీరో పాత్ర కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అందుకే ‘యానిమల్’ టైటిల్ బాగుంటుందని పెట్టా. నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అందుకే ఈ చిత్రానికి ఎడిటర్ కూడా నేనే.  ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు. ఒక కుటుంబం, ప్రత్యర్థులు లాంటి చాలా లేయర్స్ ఉన్నాయి. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. 

 నా నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారితోనే. జూన్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్‌‌లో ట్రీట్‌‌మెంట్ డైలాగ్స్‌‌పై వర్క్ చేయాలి. తర్వాత అల్లు అర్జున్‌‌తో పాటు మహేష్ బాబు గారికి ఓ కథ చెప్పాను.

ఈ కథ రాస్తున్నప్పుడు  ప్రేమ కంటే ప్రతీకారం గొప్ప ఎమోషన్ అనిపించింది. రివెంజ్‌‌లో ఎక్కువ ఎనర్జీ  ఉందని అనిపించింది. రివెంజ్ సాధించాడా, లేదా అనే మాట కంటే ఆ ప్రయాణం పట్టుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు గమనిస్తే వార్ చిత్రాలలో కూడా బలమైన రివెంజ్ ఉంటుంది.