బుమ్రాకు ప్రత్యామ్నాయం.. ముంబై జట్టులో సందీప్ శర్మ!

బుమ్రాకు ప్రత్యామ్నాయం.. ముంబై జట్టులో సందీప్ శర్మ!

స్టార్ పేసర్ జస్ర్పిత్ బుమ్రా ఐపీఎల్2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్ సన్ కూడా గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంతో ముంబై జట్టు వీళ్ల స్థానంలో మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకునే ఆలోచనలో పడింది. ఐపీఎల్ 2023 సీజన్ వేలంలో అమ్ముడు పోని సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో సందీప్ ట్రాక్ రికార్డ్ బాగుంది. బుమ్రాకు సమానంగా వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్ లో 53 వికెట్లు) తీసిన రికార్డు సందీప్ పేరిట ఉంది. మొత్తం ఐపీఎల్ లో 114 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో పంజాబ్ తరుపున 5 మ్యాచులు ఆడిన సందీప్ 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒకే మ్యాచులో దిగ్గజ బ్యాటర్లు గేల్, విరాట్, డివిలియర్స్ ను ఔట్ చేసిన ఘనత సందీప్ కే సొంతం. ఐపీఎల్ లో కోహ్లీని 7 సార్లు ఔట్ చేశాడు. ఏ బౌలర్ చేతిలో కోహ్లీ ఇన్నిసార్లు ఔట్ కాలేదు. ఐపీఎల్ లో సందీప్ బౌలింగ్ లో 72 బంతులాడిన కోహ్లీ కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. 

మరిన్ని వార్తలు