
మక్తల్, వెలుగు: నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని సంగం బండ ప్రాజెక్టు ఒక గేట్ ను ఎత్తి గురువారం ఇరిగేషన్ ఈఈ సురేశ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు సంగం బండ ప్రాజెక్టుకు వరద నీరు పెద్ద మొత్తంలో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుందన్నారు.
సంగం బండ ప్రాజెక్టు నీటిమట్టం 3.64 టీఎంసీల కెపాసిటీ ఉండగా.. ప్రస్తుతం వరద ఎక్కువగా వస్తుండటంతో సంగంబండ ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు తమ మోటార్లను వాగులో నుంచి తీసుకోవాలన్నారు. వరద వస్తున్నప్పుడు ఎవరు చేపల వేటకు, వాగు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈ బాలచందర్, సంజయ్, కాంగ్రెస్ నేతలు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.