పటాన్ చెరులో డ్రంక్ అండ్ డ్రైవ్

పటాన్ చెరులో డ్రంక్ అండ్ డ్రైవ్

సంగారెడ్డి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ యువత డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు. వైన్ షాపుల ముందు అయితే మందుబాబులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ సందర్భంగా నేషనల్ హైవే పై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూటుగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మందు కొట్టి బైక్ నడుపుతున్న వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేస్తున్నారు.

 

ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మందుబాబులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. జరిమానాలకు భయపడకుండా మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు.