సానియా మీర్జా భర్తను బావ అంటూ పిలిచిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

V6 Velugu Posted on Oct 26, 2021

టీ20 వరల్డ్ కప్‌ను భారత్ పేలవంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో మన ప్లేయర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌‌ టోర్నీలో ఇండియాను ఓడించడంతో పాక్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలాఉంటే.. భారత్ బ్యాటింగ్ సమయంలో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాక్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌‌‌ను కొందరు ఫ్యాన్స్ జీజా జీ (బావ గారు) అని పిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్తను బావ గారు అంటూ ఫ్యాన్స్ పిలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సానియా.. నవ్వుతున్న ఎమోజీతోపాటు లవ్ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ బంద్

ముగిసిన అమిత్ షా పర్యటన.. కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్ 

పాక్ గెలుపుపై టీచర్ సంబురం.. సస్పెండ్ చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్

Tagged T20 World Cup, sania mirza, Shoaib Malik, India Pakistan match, World Cup 2021, Dubai International Stadium

Latest Videos

Subscribe Now

More News