పాక్ గెలుపుపై టీచర్ సంబురం.. సస్పెండ్ చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్

పాక్ గెలుపుపై టీచర్ సంబురం.. సస్పెండ్ చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా రెండ్రోజుల క్రితం జరిగిన ఈ మ్యాచ్ ను కేవలం దాయాది దేశాలే కాదు యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా చూసింది. కానీ ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ అంటే కొంత మంది ఒక యుద్ధంలా ఉత్కంఠగా చూస్తారు. గెలుపోటములు కామన్ అన్నట్టుగా ప్లేయర్స్ చాలా స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించినప్పటికీ జనాల్లో మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోవడం కొంత కష్టంగానే ఫీలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఎవరైనా పాకిస్థాన్ గెలుపుపై సంబురాలు చేసుకుంటే ఆ వ్యక్తిని శత్రువులా చూస్తారు. ఇటువంటి సంఘటనే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. పాక్ గెలుపుపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టిన టీచర్ ను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

ఉదయ్ పూర్ లోని నీర్జా మోడీ ప్రైవేట్ స్కూల్ లో పని చేసే నఫీసా అట్టారీ అనే టీచర్ ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ టీమ్ విజయం సాధించడంపై సంబురంగా ఫీల్ అయింది. దీంతో ‘వుయ్ వన్ (మనం గెలిచాం)’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది. పాకిస్థాన్ ప్లేయర్ల ఫొటోలను కూడా స్టేటస్ లో పెట్టింది. ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ ను స్కూల్ లో పని చేసే ఇతర టీచర్లు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్క్రీన్ షాట్స్ తీసి స్కూల్ మేనేజ్మెంట్ కు పంపారు. దీంతో నఫీసాను  పిలిచి, ‘మీరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా ఆమె అవునని సమాధానం ఇచ్చారని స్కూల్ మేనేజ్మెంట్ చెబుతోంది. దీంతో ఆమెను జాబ్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం: 

టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ బంద్

బైపోల్ తర్వాత కేసీఆర్ నేలకు దిగుతడు: ఈటల

ముగిసిన అమిత్ షా పర్యటన.. కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్