4 నెలలుగా జీతాలేవ్..మేం పనులు చేయం

4 నెలలుగా జీతాలేవ్..మేం పనులు చేయం

కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గత ఐదు రోజుల నుండి నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలుపుతూ పారిశుధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల పెండింగ్ వేతనాలతో పాటు పీఎఫ్, ఈ.ఎస్.ఐ చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే అధికారుల నుండి‌ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ్టి నుండి విధుల బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులను కార్యాలయం లోపలికి వెళ్లకుండా కార్మికులు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చాకే ఆఫీస్ లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధాన ద్వారం వద్ద కార్మికుల బైఠాయింపుతో.. సిబ్బంది, అధికారులు ఆఫీస్ బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపాలిటీలోని పరిసర ప్రాంతాల్లో చెత్త సేకరణ ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.