ఇండియన్ నేవీలో కొత్త ఆఫీసర్ .. వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్‌‌‌‌ గా సంజయ్ వాత్సాయన్

ఇండియన్ నేవీలో కొత్త ఆఫీసర్ .. వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్‌‌‌‌ గా సంజయ్ వాత్సాయన్

ముంబై: భారత నౌకాదళంలో అత్యంత కీలకమైన వెస్ట్రన్ నావల్ కమాండ్ (డబ్ల్యూఎన్‌‌‌‌సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్- చీఫ్‌‌‌‌గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రేపటి నుంచి నూతన నౌకాదళ అధిపతి (నేవీ చీఫ్) గా బాధ్యతలు చేపట్టనున్న వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 

అంతకు ముందు వాత్సాయన్ నౌకాదళ వైస్ చీఫ్‌‌‌‌గా సేవలందించారు. వెల్లింగ్టన్‌‌‌‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, గోవా నావల్ వార్ కాలేజ్, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1988లో నౌకాదళంలో చేరిన సంజయ్ వాత్సాయన్.. గన్నరీ, మిస్సైల్ వ్యవస్థల్లో నిపుణుడు.