షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నరు : సంజయ్ కుమార్

షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నరు : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: బీజేపీ పసుపు బోర్డుతో పసుపు రైతులకు చేసింది ఏమీలేదని, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెట్టాలని చూస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం పార్టీ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో సాగు 30వేల ఎకరాల నుంచి 13వేల ఎకరాలకు తగ్గిందన్నారు. గతంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూయించి మళ్లీ మీరే తెరిపిస్తామని ఎంపీ అర్వింద్​పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాడు కాంగ్రెస్ రైతులను మోసం చేస్తే, నేడు బీజేపీ మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు.