ఏఐ రెగ్యులేషన్​కి సెబీ తరహా మోడల్ ఉండాలి : సంజీవ్​ సన్యాల్

ఏఐ రెగ్యులేషన్​కి సెబీ తరహా మోడల్ ఉండాలి : సంజీవ్​ సన్యాల్
  • సంజీవ్​ సన్యాల్​ సూచన

న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) రెగ్యులేషన్​ కోసం ఇండియా రూల్స్​ తీసుకొస్తుందని, ఈ ఏఐ రెగ్యులేటర్​ సెబీ తరహాలో పనిచేస్తుందని ప్రైమ్​ మినిస్టర్స్​ ఎకనమిక్​ ఎడ్వైజరీ కౌన్సిల్ (పీఎంఈఏసీ)​ మెంబర్ సంజీవ్​ సన్యాల్​ వెల్లడించారు. సెల్ఫ్​ రెగ్యులేషన్​ లేదా బ్యూరోక్రటిక్​ రెగ్యులేషన్​ బహుశా ఏఐ రెగ్యులేషన్​కి సరైనవి కావని పేర్కొన్నారు. టెక్నాలజీని అర్ధం చేసుకునే రెగ్యులేటర్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​కు అవసరమని, ఈ దిశలో ఇండియా ఆలోచించాలని సంజీవ్​ సన్యాల్​ చెప్పారు.

టెక్నాలజీ పోకడ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు ఈ రెగ్యులేటరీ ఏజన్సీ అర్ధం చేసుకోవల్సి ఉంటుందని అన్నారు. సెబీ తరహాలో ఒక రెగ్యులేటరీ ఏజన్సీని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ రెగ్యులేషన్​ కోసం తీసుకురావల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏఐ ఎటు వెళ్తోందనే అనవసరమైన విషయం పై కాకుండా, ఎలా మారుతోందనే అంశంపైనే ఆ  రెగ్యులేటరీ ఫోకస్​ పెట్టాలని సంజీవ్​ సన్యాల్​ సూచించారు.

ఫైనాన్షియల్​ మార్కెట్లో సర్క్యూట్ బ్రేకర్ల లాగే, ఏఐ రెగ్యులేషన్​లోనూ నియంత్రణాపరమైన రూల్స్​ ఉండాలన్నారు. ఆడిట్​ మాదిరిగా రెగ్యులర్​ ఆడిట్స్​ ఉండాలని, బిజినెస్​ మోడల్స్​– అకౌంట్లను కంపెనీలు వివరించే మాదిరిగానే ఏఐ ఏ విధంగా పనిచేస్తోందో వివరించేలా విధానాలు ఉండాలన్నారు.