సంక్రాంతి సూపర్ ఫుడ్: అరిసెలు

సంక్రాంతి సూపర్ ఫుడ్: అరిసెలు

అరిసెలు లేని సంక్రాంతి ఊహించుకోలేం. నువ్వుల అరిసెలు చూస్తేనే నోరూరుతుంది. నిజానికి నువ్వులు మన ఫుడ్‌‌లో భాగం అయితే చాలా వరకు హెల్త్‌‌ సమస్యలు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో ఐరన్, జింక్, క్యాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలకి ఐరన్ ఎక్కువగా ఉండే నువ్వులు, బెల్లం కలిపి తినటం మంచిదని చెబుతారు.  సంక్రాంతి స్పెషల్ గా నువ్వులు, బెల్లం వేసిన అరిసెలని తినాలని చెప్పేది కూడా అందుకే. బాడీలో ఐరన్ శాతం పెరగటానికి ఇంతకు మించిన ఫుడ్ లేదు.

నువ్వుల అరిసెల్లో ఉండే నల్ల నువ్వులు చెడు కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలు మన బాడీలో చేరకుండా అడ్డుకుంటాయి.  బాడీలో ఉండే అలసట తగ్గిపోవటానికి, కొత్త శక్తి రావటానికి కావాల్సిన అన్ని విటమిన్స్‌‌ ఉన్న సూపర్ ఫుడ్ అరిసెలు. అందుకే అరిసెలను పండుగకు రెండు వారాల ముందే చేసుకుని, పండుగ అయిపోయాక మరో రెండు మూడు వారాల వరకూ తింటారు.