సంక్రాంతి ఎఫెక్ట్ : తిరుమల కొండకు భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు

సంక్రాంతి ఎఫెక్ట్ :  తిరుమల కొండకు భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. ‌సంక్రాంతి సెలవుల కారణంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ SSD దర్శనానికి సుమారు 7 గంటలు, 300/- రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 

ఇక గురువారం ( 2026 జనవరి 15)  తిరుమల శ్రీవారిని 64 వేల 64 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరులో 30వేల 663 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.