
సంక్రాంతి పండుగ సందర్బంగా పలు ప్రాంతాలకు మరికొన్ని స్పెషల్ రైళ్లను నడపున్నుట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఇప్పటికే జనవరి 11 నుంచి 13వ తేదీల మధ్య పలు స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే శాఖ. రద్దీ కారణంగా లేటెస్ట్ గా మరో ఆరు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించింది.
స్పెషల్ ట్రైన్స్ ఇవే
- సికింద్రాబాద్ నుంచి తిరుపతి ( ట్రైన్ నంబర్ 07489 ) – జనవరి 15న
- తిరుపతి నుంచి సికింద్రాబాద్ (07490) – జనవరి 16న
- సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (07066) – జనవరి 17న
- కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ (07067) – జనవరి 18న
- నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ (07251)) – జనవరి 17న
- సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ (07252) – జనవరి 18న