హైదరాబాద్సిటీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల నుంచి సంక్రాతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే టికెట్ బుకింగ్‌లను ప్రారంభించింది. 60 రోజుల ముందుగానే అధికారులు ఈ టికెట్ల బుకింగ్లు ప్రారంభించారు. త్వరలోనే సంక్రాంతి స్పెషల్ రైళ్లను కూడా ప్రకటించనున్నారు.
సోమవారం నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా.. జనవరి 9వ తేదీ కోసం వాటిని జారీ చేశారు. జనవరి10కి మంగళవారం నుంచి,11కి బుధవారం నుంచి, 12వ తేదీకి గురువారం నుంచి టికెట్లను జారీ చేయనున్నారు. ఇలా జనవరి16 వరకు రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 17 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే ఐఆర్టీసీ అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
