సర్పంచ్​లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సఫాట్​ శంకర్

సర్పంచ్​లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సఫాట్​ శంకర్

బెల్లంపల్లి రూరల్, వెలుగు : రాష్ట్రంలోని సర్పంచ్​లు అందరూ ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కాసిపేట  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పెద్దనపల్లి సర్పంచ్​ వేముల కృష్ణ, సర్పంచ్​ల సంఘం జిల్లా అధ్యక్షుడు సఫాట్​ శంకర్​ సర్పంచ్​లకు పిలుపునిచ్చారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన సర్పంచ్​లతో కలిసి సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచ్​లు ఎవరూ సంతోషంగా లేరని, రెండేండ్లుగా పంచాయతీ బకాయిలు విడుదల కాక సర్పంచ్​లు అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య​అరాచకాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కేసులు పెట్టి వేధించినట్లు ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బిల్లులు రాక సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం పంచాయతీ ఖాతాల్లో జమ చేయకుండా ఇతర పథకాలకు దారి మళ్లించిందని ఆరోపించారు. అందుకే ఈసారి కాంగ్రెస్​కు మద్దతు తెలుపుతున్నామని, పార్టీని రాష్ట్రంలో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్​లు మక్కాల శ్రీనివాస్, లావుడియా సంపత్, ఎంపీటీసీ పార్వతి, నాయకులు అప్పని శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : బీఆర్​ఎస్ ​సభా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ