తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. గిల్‌తో డేటింగ్ వార్తలపై మౌనం వీడిన సారా 

తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. గిల్‌తో డేటింగ్ వార్తలపై మౌనం వీడిన సారా 

సారా టెండూల్కర్‌- శుభ్‌మాన్ గిల్- సారా అలీ ఖాన్. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే మనకు కూడా తెలియదు కాబట్టి. కాకపోతే ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు ఒకచోట కనిపించినా.. ఆరోజు వారు ప్రేమలో ఉన్నట్లే. నిజానికి వారు ప్రేమలో లేకపోయినా మనకు ఉన్నట్లే. తాజాగా, ఈ రూమర్లకు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఫుల్ స్టాప్ పెట్టింది. 

నటి అనన్య పాండేతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సారా అలీ ఖాన్‌కు హోస్ట్ కరణ్ జోహార్ నుంచి గిల్‌‌తో డేటింగ్ వార్తలపై ప్రశ్న ఎదురైంది. అందుకు ఈ అందాల నటి బదులిస్తూ.. ఆ సారా తాను కాదని వెల్లడించింది. గిల్‌తో తనకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది.

"అబ్బాయిలు.. మీరు అర్థం చేసుకుంటున్నారు.. సార కా సార దునియా గలాత్ సార కే పీచయ్ పద హై (ప్రపంచమంతా తప్పు సారా వెంబడి ఉంటుంది).." అని సైఫ్ అలీ ఖాన్ కుమార్తె తెలిపింది. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సారా తాను కాదని ఈ అమ్ముడు చెప్పిన సమాధానంతో సారా టెండూల్కర్‌- శుభ్‌మాన్ గిల్ బంధం నిజమే అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

కాగా,  గిల్ వన్డే ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఈ  టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్ ల్లో 219 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.