Shubman Gill: ట్రయాంగిల్ లవ్: సారా చూపు గిల్ వైపు.. వేరే అమ్మాయితో టీమిండియా కెప్టెన్

Shubman Gill: ట్రయాంగిల్ లవ్: సారా చూపు గిల్ వైపు.. వేరే అమ్మాయితో టీమిండియా కెప్టెన్

టీమిండియా యువ స్టార్ బ్యాటర్ శుభమాన్ గిల్ ప్రస్తుత క్రికెట్ లో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గిల్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటింది. అతను చాలామంది సెలెబ్రిటీలతో ప్రేమలో ఉన్నట్టు.. కొందరితో డేటింగ్ చేస్తున్నట్టు గతంలో చాలానే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిలో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు. గిల్ కూడా ఎప్పుడూ తన రిలేషన్ షిప్ పై నోరు విప్పలేదు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ తో గిల్‌ ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం గిల్ తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు. 

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడుతూ.. తాను మూడు సంవత్సరాలకు పైగా సింగిల్ గానే ఉంటున్నాని స్పష్టం చేసి తనపై వస్తున్న డేటింగ్ ఊహాగానాలన్నింటినీ ఖండించాడు. దీంతో గిల్, సారా మధ్య వస్తున్న పుకార్లకు బ్రేక్ పడింది. అయితే తాజాగా, వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కంట పడ్డారు. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో గిల్, సారా ఒకే చోట తళుక్కుమన్నారు. ఈ ప్రోగ్రామ్ లో సారా అదే పనిగా వెనక్కి తిరిగి గిల్ వైపు తిరిగి చూస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి ప్రేమ పుకార్లు మొదలయ్యాయి. 

ALSO READ : ఫిడే విమెన్స్‌‌ వరల్డ్ కప్‌‌.. రెండో గేమ్‌‌లో దివ్య ఓటమి

ఆసక్తికర విషయం ఏంటంటే.. అదే సమయంలో గిల్ వేరొక మహిళతో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. ఆ మహిళ ఎవరో వీడియోలో కనిపించలేదు. దీంతో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సారా, శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్టు గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. ఈ విషయంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఈ కార్యక్రమానికి క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, డారెన్ గోఫ్ వంటి మాజీ మరియు ప్రస్తుత క్రికెటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం గిల్ ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు, జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఈ టెస్ట్ జరుగుతుంది.