IND vs ENG 4th Test: హిందీలో మాట్లాడితే నాకు అర్ధమవుతుంది..సర్ఫరాజ్‌తో ఇంగ్లాండ్ క్రికెటర్

IND vs ENG 4th Test: హిందీలో మాట్లాడితే నాకు అర్ధమవుతుంది..సర్ఫరాజ్‌తో ఇంగ్లాండ్ క్రికెటర్

రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. 2వ రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్, టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ స్టంప్ మైక్‌లో మాట్లాడిన కామెంట్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌లో షోయబ్‌ బషీర్‌ బ్యాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. షార్ట్ లెగ్ లో క్రీజు దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ తనకు హిందీ రాదని బషీర్‌తో అన్నాడు. 

బషీర్ దీనికి నవ్వుతూ తనకు హిందీ భాషలో చెబితేనే కాస్త అర్ధమవుతుంది అని చెప్పాడు. సర్ఫరాజ్ ఖాన్.. ఇస్కో టు హిందీ నహీ ఆతీ హై అంటే.. దానికి ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ స్పందిస్తూ 'తోడి థోడి ఆతీ హై హిందీ' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. షోయబ్ బషీర్ పాకిస్తాన్ మూలానికి చెందినవాడు. తమ తల్లి దండ్రులు ఇంగ్లాండ్‌కు వలస రావడంతో బషీర్ అక్కడే సెటిల్ కావాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో బషీర్.. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సిరీస్ కు ముందు దుబాయ్‌ నుంచి భారత్‌కు రావడంలో బషీర్ వీసా సమస్యతో వార్తల్లో నిలిచాడు.

రాజ్‌కోట్ టెస్ట్‌కు బషీర్ ను పక్కనపెట్టి మార్క్ వుడ్‌ని తుది జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్  వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరంగా కావడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సర్ఫరాజ్ రాజ్ కోట్ టెస్టులో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు.