రేపటి నుంచి సరిపోదా శనివారం నెక్స్ట్ షెడ్యూల్

రేపటి నుంచి సరిపోదా శనివారం  నెక్స్ట్ షెడ్యూల్

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ మూవీకి సంబంధించి  నెలలో ఏదో ఒక శనివారం కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్న టీమ్.. ఈ శనివారం  షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. నెక్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రేపటి నుంచి ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. 

ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు  సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో నాని రగ్గడ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు.  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 29న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.  ‘అంటే సుందరానికీ’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.