మెగా మూవీ కోసం..

మెగా మూవీ కోసం..

మరో మూడు వారాల్లో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా టైటిల్ సాంగ్ రేపు విడుదల కాబోతోంది. మరోవైపు లాస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ షూట్ జరుగుతోంది. రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌‌‌‌‌‌‌‌లోనూ స్పీడు పెంచారు. అయితే ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీతో సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నాడు మహేష్‌‌‌‌‌‌‌‌. చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. రామ్‌‌‌‌‌‌‌‌ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు తెలిసింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. మెగా ఫ్యామిలీతో మహేష్‌‌‌‌‌‌‌‌కి మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు చేయడంతో దర్శకుడు కొరటాల శివతోనూ గుడ్ రిలేషన్ ఉంది. అందుకే ఈ మూవీకి వాయిస్ ఇచ్చేందుకు మహేష్ ముందు
కొచ్చాడు. అయినా వాయిస్ ఓవర్ ఇవ్వడం అతనికి కొత్తేమీ కాదు. గతంలో జల్సా, బాద్‌‌‌‌‌‌‌‌షా లాంటి చిత్రాలకు మహేష్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.