
వినాయకనిమజ్జనానికి సరూర్ నగర్ మినీట్యాంక్ బండ్ చెరువును రాచకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ సీపీ పరిధిలో 10 వేల మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. సరూర్ నగర్ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టపై 70 సీసీ కెమెరాలు, అలాగే ఈ చెరువుకు వచ్చే రూట్లలో 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం నిమజ్జనానికి మూడు క్రేన్లు ఏర్పాటు చేశామని.. మహా నిమజ్జనం నాటికి ఎనిమిది క్రేన్ లు అందుబాటులో ఉంటాయన్నారు.
ALSO READ | హైదరాబాద్లో వెరైటీ వినాయకులు
నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టపై విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీరు, మొబైల్ టాయిలెట్స్, సరూర్ నగర్ చెరువు చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యే వరకు సీసీ కెమారాలతో నిఘా.. పోసీస్ సిబ్బంది గస్తీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ తో పాటు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి,GHMC డిప్యూటీ కమిషనర్ సుజాత తదితరులు ఉన్నారు .