సీఎం, డిప్యూటీ సీఎంకు కలిపి చెక్ పవర్ ఇస్తే బాగుండు: సర్పంచ్ అక్కి పాండు రంగారెడ్డి

సీఎం, డిప్యూటీ సీఎంకు కలిపి చెక్ పవర్ ఇస్తే బాగుండు: సర్పంచ్ అక్కి పాండు రంగారెడ్డి

సర్పంచులను అరిగోస పెడ్తున్న సీఎం కేసీఆర్కు పాపం తగుల్తదని సర్పంచులు అన్నారు. ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు తమ ఆవేదనను పంచుకున్నారు. నిధులు రాక, అప్పులు కట్టలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించారని యాచారం మండలం చింతబట్ల సర్పంచ్ అక్కిపాండు రంగారెడ్డి వాపోయారు. మొదటి ఏడాది చెక్ పవర్ ఎవరికీ ఇవ్వకుండా కాలం గడిపిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.  సర్పంచ్, ఉప సర్పంచ్లకు కలిపి చెక్ పవర్ ఇచ్చినట్లే సీఎంకు, డిప్యూటీ  సీఎంకు కలిపి చెక్ పవర్ ఇస్తే బాగుండేదనని అన్నారు. కేసీఆర్ హయాంలో సర్పంచులే కాదు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఛైర్మన్ లు కూడా కష్టంగానే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి అమ్ముకున్న డబ్బులుంటే 9 నెలల్లో రూ.40లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశానని అక్కి పాండు రంగారెడ్డి వాపోయారు. ఉప సర్పంచ్ ఉద్యోగం వచ్చి వెళ్లిపోవడంతో ఏడాదిన్నరలో రూ.50లక్షలు ఖర్చు చేసినా ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్పంచుల పరిస్థితి అధ్వానంగా ఉందన్న ఆయన.. వారు తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని, చాలా మంది బాధతో పార్టీ మారుతున్నరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్పంచుల పదవీకాలం మరో ఏడాది పెంచాలని పాండు రంగారెడ్డి కోరారు.