
నిర్మల్, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు బుధవారం ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాకపోతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అభివృద్ధి పనులను చేపట్ట లేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్, సర్పంచులు ముత్యంరెడ్డి, రాజేందర్, జీవన్ రెడ్డి, గంగన్న, గంగాధర్, రవి, రాకేష్, నవీన్, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.