
- పెండింగ్ బిల్లులు చెల్లించాలి
- అర్బన్, రూరల్ సర్పంచ్ ల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం
సిద్దిపేట రూరల్, వెలుగు : గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించి గ్రామాల సర్పంచుల పదవీకాలాన్ని ఇంకో రెండు సంవత్సరాల పాటు పొడిగించాలని ర్బన్, రూరల్ గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
తాము పదవులలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల పాటు చెక్ పవర్ లేకుండా ఉన్నామని, కరోనా సమయంలో రెండు సంవత్సరాల కాలం వృథాగా గడిచిపోయిందన్నారు. 1994 నుండి 96 వరకు అప్పటి సర్పంచ్ లకు ఇన్‌చార్జులుగా ఎలాగైతే సమయాన్ని పొడిగించారో
తమకు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రెండు సంవత్సరాల పాటు పదవి పొడిగించాలని డిమాండ్ చేశారు. రూరల్ గ్రామ సర్పంచ్‌లు పల్లె నరేశ్ గౌడ్, సదాశివ రెడ్డి, ఏల దేవయ్య, అర్బన్ గ్రామ ల సర్పంచ్ లు రవీందర్ గౌడ్, రాజయ్య ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.