పల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచుల డిమాండ్

పల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచుల డిమాండ్

చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో చాలా చోట్ల సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన సర్పంచ్ లు తమ ఆవేదన వెళ్లగక్కారు. నాలుగో విడత పల్లెప్రగతి పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తేనే ఐదో విడత పల్లెప్రగతిలో పాల్గొంటామని స్పష్టం చేశారు. 

ఐదో విడత పల్లెప్రగతిపై MPDO ఆఫీసులో జరిగిన సమావేశంలో తమ ఆవేదనను సర్పంచులు వెళ్లగక్కారు. అప్పులు చేసి నాలుగో విడత పల్లెప్రగతి పనులు చేయించామని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీవన్ రెడ్డి చెప్పారు. లక్షలాది రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, చాలామంది సర్పంచులు అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని వాపోయారు. అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.  

మరిన్ని వార్తల కోసం..

మల్లారెడ్డికి నిరసన సెగ

సివిల్స్ లో మెరిసిన తెలుగుతేజాలు