సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 9 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) స్పోర్ట్స్ కోటా.
మొత్తం ఖాళీలు: 404.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్ లేదా సీనియర్/ జూనియర్ నేషనల్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా/ యూనివర్సిటీ/ వింటర్/ పారా గేమ్స్ లేదా ఎస్ జీఎఫ్ఐ లేదా ఇంటర్ – యూనివర్సిటీ టోర్నమెంట్స్ లేదా నేషనల్ స్కూల్ గేమ్స్ ల్లో పతకాలు సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: మే 9.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
లాస్ట్ డేట్: జూన్ 06.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంటేషన్, స్పోర్ట్స్
అచీవ్మెంట్ చెకింగ్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssb.gov.in ను సందర్శించండి.
►ALSO READ | SBI Hiring: లోన్ ఎగ్గొట్టాలని కలలో కూడా అనుకోకండి..4వేల మంది రికవరీ టీం రిక్రూట్ చేస్తున్న SBI
