Tourist Family OTT: రాజమౌళి మెచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ.. ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం! కారణమిదే

Tourist Family OTT: రాజమౌళి మెచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ.. ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం! కారణమిదే

సాధారణ ప్రేక్షకులు మొదలు, సెలబ్రిటీల వరకూ అందరిచూపు మహేష్‌‌బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాపై ఉంది. ఆ సినిమా ఎలా ఉండబోతోందా, మహేష్‌‌ను జక్కన్న ఎలా చూపించబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళిని మాత్రం ఓ చిన్న చిత్రం ఆకర్షించింది.  అదే ‘టూరిస్ట్‌‌ ఫ్యామిలీ’.

ఈ సినిమాను చూడటమే కాకుండా.. అత్యధ్బుతమైన సినిమా చూశానంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు రాజమౌళి.  ‘అద్భుతమైన సినిమా చూశా..  హృదయాన్ని కదిలించింది, అలాగే కడుపుబ్బా నవ్వించింది.. ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్‌‌ ఆసక్తికరంగా ఉంది. అభిషన్‌‌ జీవింత్‌‌ గొప్పగా రాసి తెరకెక్కించాడు. ఇటీవలి కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. ఎవరూ మిస్‌‌ అవ్వొద్దు.. తప్పకుండా చూడండి’ అంటూ రివ్యూ ఇచ్చారు రాజమౌళి. 

ఇందుకు ఆ చిత్ర దర్శకుడు అభిషన్‌‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాడు. శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేష్ ఈ తమిళ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడిగా అభిషన్ జీవింత్‌‌కు ఇదే తొలిచిత్రం. 

Also Read:-విశ్వంభర’ పుస్తకంలో ఏముంది? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన ఓ చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథ. అరెస్టు బెదిరింపుల మధ్య, అంటీ ముట్టనట్టుగా ఉండే చుట్టుపక్కల వాళ్లతో కలిసిపోడానికి ఎలా కష్టపడాల్సి వచ్చింది అనేది ఎమోషనల్‌‌ అండ్‌‌ కామెడీ కలగలిపి తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.  
మే 1న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతోంది. ఇటీవల రజినీకాంత్, శివకార్తికేయన్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మే 24న జపాన్‌‌లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. 

ఓటీటీ రిలీజ్ ఆలస్యం: 

‘టూరిస్ట్‌‌ ఫ్యామిలీ’మూవీ మే 31 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందనే  తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూవీ మేకర్స్, జియోహాట్‍స్టార్ ప్లాట్ ఫామ్ తో ముందే మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం మే నెలాఖరులోనే స్ట్రీమింగ్ అవ్వాలి.

కానీ, ఈ మూవీ ఇప్పటికీ థియేటర్స్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. దీంతో జియోహాట్‍స్టార్ సంస్థతో మాట్లాడి ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యేలా గడువు కోరినట్లు ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఇందుకు జియోహాట్‍స్టార్ సంస్థ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ సెకండ్ వీక్లో ‘టూరిస్ట్‌‌ ఫ్యామిలీ’స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. 

టూరిస్ట్ ఫ్యామిలీ' మే 1న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూర్య 'రెట్రో'తో పోటీ పడింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింది. కలెక్షన్ల లెక్క మున్ముందు ఇంకా పెరగనుంది.