Vishwambhara: ‘విశ్వంభర’ పుస్తకంలో ఏముంది? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

Vishwambhara: ‘విశ్వంభర’ పుస్తకంలో ఏముంది? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

మెగాస్టార్ చిరంజీవి నుంచి త్వరలో రిలీజ్ కాబోయే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విశ్వంభర. చిరు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2025 వేదికపై భాగమైంది. ఈ సినిమాకు సంబంధించిన పుస్తకాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్‌ విడుదల చేశారు. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఫొటోలు పంచుకుంది.

‘‘విశ్వంభర’ ప్రపంచం మీ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకోవాలంటే వేచి ఉండండి’’అని తెలిపింది. 'విశ్వంభర' పుస్తకంలో ఏముంది? అనే ప్రశ్నతో పెట్టిన ట్వీట్ ఇపుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ పుస్తకాన్ని గురించి సోషల్ మీడియాలో #WhatIsInsideVishwambharaBook అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రోమోషన్ కూడా షురూ చేసింది.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తుండటంతో అన్నీ వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ ఉండటం వల్ల అంతర్జాతీయస్థాయిలో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. 'ఏసిక్ రివీల్' పేరుతో ఇవాళ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. 

Also Read:-‘OG క్వీన్ ఆఫ్ కేన్స్’.. నుదుటిన ‘సిందూరం’తో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌..

సోషియో ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో వీఎఫ్ఎక్స్ కు భారీ స్కోప్ ఉంది. ఫెస్టివల్ లో 'విశ్వం భర' ప్రధాన ఆకర్షణ కానుంది. త్రిష, ఆషికా రంగనాద్ హీరోయిన్లు. యూవీ బ్యానర్లో దర్శకుడు వశిష్ట తెరకెక్కిసున్న ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావించగా.. వీఎఫ్ఎక్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో దసరా బరిలో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఇకపోతే ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. అషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.