జీలుగు విత్తనాల పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే

జీలుగు విత్తనాల పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే

సత్తుపల్లి, వెలుగు : మండల పరిధిలోని కాకర్లపల్లి పీఏసీఎస్​లో రైతులకు 50 శాతం రాయితీ పై జీలుగు విత్తనాలను మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీలుగలు 30 కిలోల బస్తా ధర రూ. 4,275 కాగా, ప్రభుత్వం 50 శాతం రాయితీతో అందజేస్తోందని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాస రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, చల్లారి వెంకటేశ్వర రావు, కిలారి వెంకటేశ్వర రావు, కంచర్ల రమేశ్​ పాల్గొన్నారు.