
ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.. ఏఐ వల్ల ప్రభావితమైన రంగాల్లో ఐటీ సెక్టార్ ముందుంటుందని చెప్పచ్చు. ఏఐ వల్ల చాలా మంది ఐటీ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఐటీ రంగం తర్వాత డిజిటల్ మీడియా కూడా ఏఐ వల్ల ఎక్కువ ప్రభావితమైందని చెప్పాలి. ఏఐ వాడకంతో ఆయా రంగాల్లో అనుభవం లేనోళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్ వంటి క్రియేటివ్ జాబ్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఏఐ వల్ల పాడ్ కాస్ట్ సెగ్మెంట్ కి కూడా తిప్పలు వచ్చి పడ్డాయి.. అవును నిజం.. ఇది స్వయానా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అంటున్న మాట.
ALSO READ | AI News: టెక్కీలకు శుభవార్త.. ఆ సంస్థ బయటపెట్టిన ఏఐ ఫెయిల్యూర్ సీక్రెట్..!!
సత్య నాదెళ్ల పాడ్ కాస్ట్ ఎక్కువగా వింటుంటారట.. అయితే, అందరిలా కాదు.. ఏఐ యూజ్ చేసి పోడ్ కాస్ట్ వింటారట సత్య నాదెళ్ల. ఏఐతో పాడ్ కాస్ట్ వినటం ఏంటా అని అనుకుంటున్నారా.. అయితే సత్య నాదెళ్ల ఏం చెప్పాడో ఇప్పుడు చుడండి.. పాడ్‌కాస్ట్‌లను బ్రేక్ డౌన్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్ AI అసిస్టెంట్‌ను ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు సత్య నాదెళ్ల. మొదట తన ఐఫోన్‌లోని కోపైలట్ యాప్‌లోకి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ట్రాన్స్‌క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేస్తానని.. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కారులో పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లోని విషయాల గురించి వాయిస్ అసిస్టెంట్‌తో చాట్ చేస్తానని తెలిపారు సత్య నాదెళ్ల.
ఔట్‌లుక్, టీమ్‌లలో తనకు వచ్చే ఈమెయిల్స్ ని సార్ట్ అవుట్ చేయడం వంటి రోజువారీ పనుల కోసం కోపైలట్‌ను ఎలా వాడతారో వివరించారు సత్య నాదెళ్ల . తాను కోపైలట్ స్టూడియో నుండి కనీసం 10 మంది కస్టమ్ ఏజెంట్లపై కూడా ఆధారపడతానని నాదెళ్ల అన్నారు, వారిని తాను AI చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా భావిస్తానని అన్నారు. మొత్తానికి సత్య నాదెళ్ల చెప్పినదాన్ని బట్టి చుస్తే.. ఏఐ వల్ల పాడ్ కాస్ట్ సెగ్మెంట్ కి కూడా గడ్డురోజులు రానున్నాయని అనిపిస్తోంది. ఇక పోడ్ కాస్ట్ లిజనర్స్ అందరు సత్య నాదెళ్లను ఫాలో అయితే.. పోడ్ కాస్ట్ డైరెక్ట్ గా వినడం మానేసి ఏఐ ద్వారా బ్రేక్ డౌన్ చేసి వినేవారు ఎక్కువవుతారేమో చూడాలి.