రివ్యూ: స్కైలాబ్

రివ్యూ: స్కైలాబ్

నటీనటులు: సత్యదేవ్,నిత్యామీనన్,రాహుల్ రామకృష్ణ,తనికెళ్ల భరణి,తులసి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్.విహారి
నిర్మాత: పృథ్వీ
రచన,దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
రిలీజ్ డేట్: డిసెంబర్ 4,2021

1970 చివ‌ర్లో స్కైలాబ్ సృష్టించిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్ర‌యోగించిన ఆ అంత‌రిక్ష నౌక ఎప్పుడు భూమ్మీద ప‌డిపోతుందో అంటూ కొన్ని దేశాల‌కి చెందిన ప్ర‌జ‌లు కొన్నాళ్ల‌పాటు భయపడుతూ కాలం వెళ్ల‌దీశారు. ఆ గండం గ‌ట్టెక్కిన స‌మ‌యంలో పుట్టిన చిన్నారుల‌కి తెలుగు రాష్ట్రాల్లో స్కైలాబ్ పేరుతో పేర్లు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడు చనిపోతామో తెలియక ఉన్న ఆస్తులు అమ్మకుని దావత్ చేసుకున్నరు.  కొన్ని ఊళ్లల్లో సంబ‌రాలు కూడా చేసుకున్నారు. అందులో క‌రీంన‌గ‌ర్ జిల్లా,  బండ‌లింగంప‌ల్లి కూడా ఒక‌టి. ఆ ఊరి క్రమంలోనే ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ ఖండేరావు ‘స్కైలాబ్‌ పేరుతో ఈ సినిమా తీశాడు. ఎలా ఉందో చూద్దాం.


కథేంటి?
‘‘స్కై లాబ్’’ 1979 లో కరీంనగర్ లోని బండ లింగం పల్లి లో జరిగే కథ.గౌరి (నిత్యామీనన్) ప్రతిబింబం అనే పత్రికలో పనిచేస్తుంటుంది కానీ తన రచనలు బాగోవని తీసేస్తారు.ఎలాగైనా మంచి రచయిత్రి కావాలనుకుంటుంది.ఆనంద్ (సత్యదేవ్)కూడా హైదరాబాద్ నుండి వచ్చి ఊళ్లో ఓ క్లినిక్ పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటాడు.మరో పక్క రామారావు( రాహుల్ రామకృష్ణ ) అప్పుల్లో ఉంటాడు.ఊళ్లో అందరూ పేదరికంలో ఉంటారు. ధనికులు పనివాళ్లను హీనంగా చూస్తుంటారు. ఈ సందర్భంలో స్కైలాబ్ అనే సాటిలైట్ ఆ ఊరి మీద పడుతుందని అంతా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్లు భయంతో ఏం చేశారు? వాళ్ల బతుకుల్లో ఎలాంటి మార్పు వచ్చింది.? ఆ ఉపగ్రహం పడిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తన పాత్రకు తగిన న్యాయం చేశాడు.నిత్య మీనన్ కు కూడా మంచి పాత్ర దక్కింది కానీ తన రోల్ కు అంత డెప్త్ లేదు.ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు.రాహుల్ రామృకృష్ణ బాగా చేశాడు.కొన్ని కామెడీ సీన్లు పండాయి.తనికెళ్ల భరణి, తులసి తదితరులు అంతా బాగా చేశారు.
టెక్నికల్ వర్క్: 
ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ సినిమా మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది.ఎడిటింగ్ బాగాలేదు.సినిమాలో చాలా ల్యాగ్ ఉంది.ఒక 20 నిమిషాలు కత్తరించాల్సింది.ఆర్ట్ వర్క్ బాగుంది.నిర్మాణ విలువలు ఓకే.డైలాగులు బాగున్నాయి.
విశ్లేషణ:
‘‘స్కైలాబ్’’ ఓ డిఫరెంట్ ప్రయత్నం. డైరెక్టర్ విశ్వక్ తను చెప్పాలనుకున్నది చెప్పాడు.కమర్షియల్ హంగులకు పోలేదు.కానీ చూసేవాళ్లకు మాత్రం ఓపిక నశిస్తుంది.సింపుల్ పాయింట్ ను తీసుకొని దాన్ని చా...లా.. లాగి బోర్ కొట్టించాడు. ఇలాంటి కథలకు మంచి రైటింగ్ ఇంపార్టెంట్.కానీ డైరెక్టర్ ఇక్కడే బోల్తాపడ్డాడు. ఇష్టం వచ్చినన్ని సీన్లు తీసేసి పెట్టాడు. అందులో చాలా వరకు రిపీటెడ్ సీన్లే ఉన్నాయి.ఇంత స్లో నరేషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ చూడలేదు.ఫస్టాఫ్ మొత్తం అక్కడక్కడ కామెడీ పంచులు తప్ప మొత్తం బోరింగే. ఎడిటింగ్ లో ఈ సినిమా ను 20 నిమిషాలు నిర్దాక్షణ్యంగా తీసేయవచ్చు.సెకండాఫ్ ఫర్వాలేదు.క్లైమాక్స్ బాగుంది.కానీ ఫస్టాఫ్ లో జరిగిన నష్టం వల్ల మొత్తం సినిమా పై ప్రభావం పడింది.చివరకు చూపించిన ఆ డ్రామా తో కూడా ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఈ మధ్య కమర్షియల్ గా తీసినా కానీ చిన్న సినిమాకు జనాలు రావడం కష్టం గా ఉంది.ఇలాంటి సినిమాలకు కష్టం.ఓటీటీలో కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయడమే.ఓవరాల్ గా ‘‘స్కైలాబ్’’ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయకపోగా సహనాన్ని పరీక్షిస్తుంది.పాయింట్ మంచిదే అయినా కానీ స్లో ట్రీట్ మెంట్ వల్ల నిరాశపరుస్తుంది.