సత్యదేవ్ 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్

సత్యదేవ్ 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్

టాలెంటడ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'. నేడు సత్యదేవ్ బర్త్ డే  సందర్భంగా కృష్ణమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో కత్తి పట్టుకుని ఉండగా, బ్యాక్గ్రౌండ్లో కృష్ణానది ఎరుపు రంగులో ఉంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీవీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా పైన మంచి అంచనాలున్నాయి.