జూన్‌‌లోనే వస్తున్న శీతాకాలం..

జూన్‌‌లోనే వస్తున్న  శీతాకాలం..

కొందరు హీరోగా నిలదొక్కుకోవాలనుకుంటారు. కానీ కొందరు మంచి యాక్టర్‌‌‌‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటారు. సత్యదేవ్ దృష్టి మొదట్నుంచీ రెండో దానిపైనే ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌‌ని సెలెక్ట్ చేసుకోవడం, బలమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వచ్చాడు. ప్రస్తుతం డిఫరెంట్‌‌ స్టోరీలతో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘గుర్తుందా శీతాకాలం’ ఒకటి. తమన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్‌‌స్టోరీలో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసినీ మణిరత్నం కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్‌‌లో రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. కన్నడలో సూపర్ హిట్టయిన ‘లవ్ మాక్‌‌టెయిల్’ చిత్రానికి తెలుగు రీమేక్‌‌ ఇది. భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం కూడా రిలీజ్‌‌కి రెడీగా ఉంది.