మార్చి 15 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానున్న సేవ్ ద టైగర్స్‌‌‌‌‌‌‌ 2

మార్చి 15 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానున్న సేవ్ ద టైగర్స్‌‌‌‌‌‌‌ 2

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని,  సుజాత, దేవయాని ప్రధానపాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ ‘సేవ్ ద టైగర్స్‌‌‌‌‌‌‌‌ 2’. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించగా, అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించాడు.  శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దర్శన బానిక్, హర్ష వర్థన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ నెల 15 నుంచి ఇది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో దర్శక నిర్మాత మహి వి రాఘవ మాట్లాడుతూ ‘ఇలాంటి ఫన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్ షోస్‌‌‌‌‌‌‌‌లో రైటింగ్ కంటే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ చాలా ముఖ్యం. వీరంతా కథను ఓన్‌‌‌‌‌‌‌‌ చేసుకుని నటించారు. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్‌‌‌‌‌‌‌‌గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సెకండ్ సీజన్‌‌‌‌‌‌‌‌ కూడా అందరికీ నచ్చుతుంది. మరిన్ని సీజన్స్ చేయాలనే ఆలోచన ఉంది’ అని చెప్పాడు.  ఫస్ట్ సీజన్‌‌‌‌‌‌‌‌ను మరిపించేలా సెకండ్ సీజన్ ఉంటుందని నటీనటులు, దర్శకులు అరుణ్ కొత్తపల్లి,  ప్రదీప్ అద్వైతం చెప్పారు.