హైదరాబాద్‌కు వచ్చాక నెలకు 40వేలు మిగులుతున్నాయి... బెంగళూరు సాఫ్ట్వేర్ ట్వీట్ వైరల్‌

హైదరాబాద్‌కు వచ్చాక నెలకు 40వేలు మిగులుతున్నాయి... బెంగళూరు సాఫ్ట్వేర్ ట్వీట్ వైరల్‌

ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నివసించడానికి బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఏది మంచిదో అనే చర్చను మళ్లీ రేకెత్తించింది. ఒక రకంగా చెప్పాలంటే.. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో జీవన విధానం, ఉపాధి, భద్రత వంటి అంశాలను ఈ పోస్ట్ ద్వారా  పోల్చి చూశారు.. ఈ రెండు నగరాల్లో లివింగ్ కాస్ట్, ప్రశాంత జీవనం గురించి అంచనా వేశారని చెప్పొచ్చు... ఫైనల్ గా జీవించేందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఏదీ మంచిదో తేల్చేశారు కూడా..       

ఈ ట్విట్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పృధ్విరెడ్డి తన పోస్ట్ లో ఇలా రాశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చాక.. నెలకు 40 వేల రూపాయలు మిగులుతున్నాయని.. ఆ డబ్బులతో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చని తెలిపారు. రెడ్డి పోస్ట్ సోషల్  మీడియా యూజర్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే కామెంట్లు, లైకులతో మేసేజ్ బ్లాగ్ నిండిపోయింది. 

ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎక్కువ మంది రెడ్డి పోస్ట్ సమర్థించారు. కొంతమంది మాత్రమే సాధ్యాసాధ్యాల గురించి చర్చ పెట్టారు. ప్రశాంతంగా జీవించడమనేది మన టైమింగ్స్ పై, మిమ్మల్ని మీరు నిర్వహించుకునే విధానం కూడా ఆధార పడి ఉంటుందని రాశాడు.. 

బెంగళూరులో అన్ని సౌకర్యాలు హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. దీంతోపాటు బెంగళూరు స్టార్టప్ కంపెనీలకంటే హైదరాబాద్ లోని స్టార్టప్ కంపెనీలె టెకీలను ఎక్కువ జీతంతో రిక్రూట్ చేసుకుంటున్నాయని.. ఓ నెటిజన్.. సాఫ్ట్ వేర్ తెలిపారు. 

లివింగ్ కాస్ట్ విషయంలోనూ హైదరాబాద్.. బెంగళూరు కంటే మెరుగైదని మరో నెటిజన్ పోస్ట్ చేశారు.. ఇక్కడ రెంట్స్ చాలా తక్కువ.. తక్కువ అద్దెతో సౌకర్యవంతమైన ఇండ్లు ఈజీగానే దొరుకుతాయి. క్యాబ్స్, ఆటోలు, ట్రావెలింగ్ ఛార్జెస్ తక్కువే.. రెస్టారెంట్లు, హోటళ్ల ఖర్చు కూడా తక్కువ అని చెప్పుకొచ్చారు మరో నెటిజన్.. 

అంతేకాదు హైదరాబాద్ లో హిందీ, ఇంగ్లీష్ భాషలను మాట్లాడతారు.. నార్త్ ఇండియన్స్ అయితే హైదరాబాద్ను ఎక్కువగా ఇష్టపడతారని ఇంకో నెటిజన్ రాశాడు. 

ఏదీ ఏమైనా నెటిజన్ల డిస్కషన్ చూస్తే లివింగ్ కాస్ట్ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ తక్కువ తెలుస్తోంది. అంతేకాదు ప్రశాంతంగా జీవించేందుకు కూడా అనువైన నగరం అని చెప్పొచ్చు.