
న్యూఢిల్లీ: ‘‘సార్..ప్రైవేటు బ్యాంకుల్లో సాలరీలు కట్‌చేస్తున్నరు కదా.. మీ స్టేట్‌బ్యాంకులో కూడా కటింగ్స్‌ఉంటాయా ?’’ అని ఒక ఎనలిస్ట్‌అడిగాడు. ‘‘ఇప్పటికే నా జీతం చాలా తక్కువయ్యా! ఇంకా తగ్గించుకున్నాననుకో… రోడ్డు మీద పడతా!’’ అని జవాబిచ్చారు స్టేట్ బ్యాంక్ చైర్మన్ రజ్‌నీశ్ కుమార్. ఎనలిస్టులతో కాన్ఫరెన్స్‌లో చోటుచేసుకున్న సరదా సంభాషణ ఇది. సరదాకే అయినా, ఒకరకంగా ఇది సర్కారీ బ్యాంకులకు, ప్రైవేటు బ్యాంకులకు జీతాల విషయంలో ఎంత తేడా ఉంటుందో చెప్పకనే చెప్పినట్టయింది.
2019లో రజనీష్‌కుమార్‌ఏడాదికి మొత్తం రూ. 29.54 లక్షల జీతం అందుకున్నారు. అంటే నెలకు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు కూడా ఉండదు. అదే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సీఈఓ ఈ 2019లోనే ఏడాదికి రూ. 55 కోట్ల జీతం అందుకున్నారు. అంటే నెలకు నాలుగున్నర కోట్ల రూపాయలపైనే జీతం తీసుకుంటున్నారన్న మాట. అలాగని ఎస్‌బీఐ ఏమన్నా బీద బ్యాంకేమీ కాదు. ఎస్‌బీఐ ఆస్తులతో పోల్చుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తులు అందులో మూడోవంతు కూడా ఉండవు. అయినా వీటి టాప్‌ఎగ్జిక్యూటివ్‌ల జీతాల మధ్య తేడా ఎంతుందో చూస్తే ఆశ్చర్యమే కదా!
కరోనా కారణంగా ఇప్పటికే యెస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్, కోటక్‌మహింద్రా బ్యాంక్‌తమ సీనియర్ మేనేజ్‌మెంట్‌ఎగ్జిక్యూటివ్‌ల జీతాలలో 10–30 శాతం కోతను ప్రకటించాయి. ఒకేఒక చిన్న తేడా ఏమిటంటే ప్రభుత్వ బ్యాంక్‌టాప్‌ఎగ్జిక్యూటివ్‌లు ఖరీదైన లోకేషన్లలో బంగ్లాలు వంటి చాలా బెనిఫిట్స్‌ను పొందుతుంటారు. కానీ ప్రైవేటు వాళ్లతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు.